Share News

Kollu Ravindra: వెన్ను విరిచి వీల్ ఛైర్ ఇచ్చే రకంగా జగన్ పాలన

ABN , First Publish Date - 2023-10-19T15:46:57+05:30 IST

అమరావతి: వెన్ను విరిచి వీల్ ఛైర్ ఇచ్చే రకంగా జగన్ పాలన ఉందని, చేతివృత్తుల వారికి సొంత కాళ్లపై నిలబడే ఉపాధి ఎక్కడ?.. సంక్షేమ పథకాలు రద్దు చేసి చేదోడుతో చిల్లరివ్వడం దగా చేయడమే జగన్ నైజమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర విమర్శించారు.

Kollu Ravindra: వెన్ను విరిచి వీల్ ఛైర్ ఇచ్చే రకంగా జగన్ పాలన

అమరావతి: వెన్ను విరిచి వీల్ ఛైర్ ఇచ్చే రకంగా జగన్ పాలన (Jagan Rule) ఉందని, చేతివృత్తుల వారికి సొంత కాళ్లపై నిలబడే ఉపాధి ఎక్కడ?.. సంక్షేమ పథకాలు రద్దు చేసి చేదోడుతో చిల్లరివ్వడం దగా చేయడమే జగన్ నైజమని టీడీపీ సీనియర్ నేత (TDP Senior Leader), మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర (Kollu Ravindra) విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలను అణగదొక్కి చేదోడుతో చిల్లర విదిల్చడమే తోడుగా నిలవడమా? అని ప్రశ్నించారు. చేతివృత్తుల వారికి గతంలో అందే పథకాలన్నీ రద్దు చేశారని, సబ్సిడీలు, స్వయం ఉపాధి రుణాలు రద్దు చేశారని, కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడం బీసీలను ఉద్దరించడమా? అని నిలదీశారు.

టీడీపీ (TDP) హయాంలో రాష్ట్ర స్థాయిలో పదవుల్లో బీసీ (BC)లకు ప్రాధాన్యం ఇచ్చామని కొల్లు రవీంధ్ర అన్నారు. ప్రస్తుతం కుల కార్పొరేషన్లు తప్ప ఎక్కడా బీసీ ప్రాతినిధ్యం కనిపించడంలేదన్నారు. ఐదు జోన్లుగా విభజించి ఐదుగురు రెడ్లకు రాష్ట్రంపై పెత్తనం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆ ప్రాంతాల్లోని బీసీ మంత్రులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్న దాఖలాలున్నాయా?.. రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించడం బీసీలను ఉద్దరించడమా?.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల రద్దుతో 16,800 పదవులు దూరం ఉద్దరించడమా? అని నిలదీశారు. 8వేల ఎకరాల బీసీ అసైన్డ్ భూములు లాక్కున్న దుర్మార్గుడు జగన్ రెడ్డి అని, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నాశనం చేసిందెవరు జగన్ రెడ్డీ?.. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం జగన్‌కు లేదన్న విషయం గుర్తుంచుకోవాలని కొల్లు రవీంధ్ర అన్నారు.

Updated Date - 2023-10-19T15:46:57+05:30 IST