IYR Krishna Rao: త్వరలో లక్ష మంది హిందువులతో బహిరంగ సభ
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:02 AM
త్వరలో లక్ష మంది హిందువులతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ( IYR Krishna Rao ) ప్రకటించారు. ఆదివారం నాడు విజయవాడలో హిందూ ధార్మిక పరిషత్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
విజయవాడ: త్వరలో లక్ష మంది హిందువులతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ( IYR Krishna Rao ) ప్రకటించారు. ఆదివారం నాడు విజయవాడలో హిందూ ధార్మిక పరిషత్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణారావు పాల్గొని మాట్లాడుతూ...‘‘ ఏపీలో హిందూ కమిషన్ ఏర్పాటు చేయాలి. హిందూ అజెండా ఆమోదించిన పార్టీల జెండానే పట్టుకుట్టాం. దేవాలయాల నుంచి ప్రభుత్వం తపుకోవాలి.కమిషన్‌లో రాజకీయేతరులను సభ్యులుగా నియమించాలి. దేవాలయాల ఆదాయం, భూములపై వైసీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.హిందూ మతాన్ని రాజకీయ పార్టీలు కులాల వారీగా విభజించి లబ్ధిపొందుతున్నాయి. అంతిమంగా హిందూ మతానికి తీరని నష్టం చేస్తున్నాయి. హిందువులకు స్వేచ్ఛగా వారి అభిప్రాయాన్ని చెప్పే పరిస్థితి ఏపీలో లేదు. హిందూ ఓటు బ్యాంకు ధ్యేయంగానే పనిచేస్తాం. హిందూ డిక్లరేషన్‌ని అన్ని రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపరచాలి’’ అని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు.