High Court: విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు హైకోర్టు అనుమతి

ABN , First Publish Date - 2023-09-01T16:29:37+05:30 IST

విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. షరతులతో కూడిన ఆందోళనలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. ఈ నెల 10న ధర్నా చేసుకోవాలని ఉద్యోగుల సంఘానికి ధర్మాసనం సూచించింది.

High Court: విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు హైకోర్టు అనుమతి

అమరావతి: విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. షరతులతో కూడిన ఆందోళనలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. ఈ నెల 10న ధర్నా చేసుకోవాలని ఉద్యోగుల సంఘానికి ధర్మాసనం సూచించింది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల లోపు జరుపుకోవాలని ఆదేశించింది. తమ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ధర్నాకు అనుమతి కావాలని కోరుతూ విద్యుత్ సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. విచారణ జరిపిన న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.

Updated Date - 2023-09-01T16:29:37+05:30 IST