APTF: జీపీఎస్‌తో ఎలాంటి భద్రత లేదు

ABN , First Publish Date - 2023-09-20T22:14:32+05:30 IST

భద్రత లేని గ్యారంటీ పెన్షన్ స్కీమ్‌ను(GPS) ఈరోజు జరిగిన క్యాబినెట్‌ మీట్‌(Cabinet meet)లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN) ఆమోదించటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీటీఎఫ్(APTF) తెలిపింది.

APTF: జీపీఎస్‌తో ఎలాంటి భద్రత లేదు

అమరావతి: భద్రత లేని గ్యారంటీ పెన్షన్ స్కీమ్‌ను(GPS) ఈరోజు జరిగిన క్యాబినెట్‌ మీట్‌(Cabinet meet)లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN) ఆమోదించటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీటీఎఫ్(APTF) తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎలాంటి భద్రత లేని గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (GPS)ను క్యాబినెట్ ఆమోదించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. GPS‌తో తీవ్రంగా నష్టపోతాం. ఈ పెన్షన్ స్కీం పేరులోనే గ్యారెంటీ ఉంది కానీ పెన్షన్ ఇవ్వడంలో గ్యారంటీ లేదు. ఇది గ్యారంటీ లేని పెన్షన్. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో సీపీఎస్‌ను రద్దు చేస్తానని చెప్పి ఈరోజు జీపీఎస్‌ను ఎలా ఆమోదిస్తారని ఏపీటీఎఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated Date - 2023-09-20T22:14:32+05:30 IST