TDP: ప్రతిఏడాది జాబ్‌ నోటిఫికేషన్ ఇస్తాం: లోకేష్

ABN , First Publish Date - 2023-03-25T19:57:21+05:30 IST

ఒక్క ఛాన్స్ అని ఏపీని జగన్‌ సర్వనాశనం చేశారని టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Lokesh) మండిపడ్డారు.

TDP: ప్రతిఏడాది జాబ్‌ నోటిఫికేషన్ ఇస్తాం: లోకేష్

అమరావతి: ఒక్క ఛాన్స్ అని ఏపీని జగన్‌ సర్వనాశనం చేశారని టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Lokesh) మండిపడ్డారు. జగన్‌ను తల్లి, చెల్లి, ప్రజలు ఎవరూ నమ్మడం లేదని విమర్శించారు. సొంత ఎమ్మెల్యేలు కూడా జగన్‌ (Jagan)ను నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. జగన్‌ పనైపోయిందని, ఖైదీ నెం.6093ని జైలు రమ్మంటోందన్నారు. ఏపీలో డెవలప్‌మెంట్ నిల్లు.. అప్పులు ఫుల్లుగా పెరిగాయని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాపిటల్‌గా ఉన్న ఏపీని గంజాయి క్యాపిటల్‌గా మార్చేశారని ద్వజమత్తారు. జగన్‌ కుడి చేత్తో రూ.10 ఇచ్చి ఎడమ చేత్తో రూ.100 దోచేస్తున్నారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని యువతను జగన్‌ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే ప్రతిఏడాది జాబ్‌ నోటిఫికేషన్ ఇస్తామని భరోసా ఇచ్చారు. అలాగే అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

Updated Date - 2023-03-25T19:57:21+05:30 IST