AP News: మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-08-29T17:42:19+05:30 IST

ఏపీ ప్రభుత్వం (AP Government) మరో వెయ్యికోట్లు అప్పు తెచ్చింది. 11 సంవత్సరాలకు 7.45 శాతం వడ్డీతో మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం వేసింది. ఆర్‌బీఐ దగ్గర 5 నెలల కాలంలో

AP News: మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఏపీ ప్రభుత్వం (AP Government) మరో వెయ్యికోట్లు అప్పు తెచ్చింది. 11 సంవత్సరాలకు 7.45 శాతం వడ్డీతో మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం వేసింది. ఆర్‌బీఐ దగ్గర 5 నెలల కాలంలో 35 వేల 500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఏపీ సర్కార్ రికార్డ్ స‌ృష్టించింది. మళ్లీ అప్పు కోసం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ చుట్టూ రాష్ట్ర అధికారులు తిరుగుతున్నారు. ఒకటోవ తేదీన ఉద్యోగుల జీతాలు ఇవ్వాల్సి ఉండటంతో మళ్లీ అప్పు కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారానే 35 వేల 500 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకురావడంతో ఆర్థిక నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము తక్కువ అప్పులు తెచ్చామని ఇప్పటికీ బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జగన్ (Cm jagan) చెబుతున్నారు. మరోవైపు అడిగినప్పుడల్లా అప్పు ఇస్తూ కేంద్రం ఆదుకుంటుంది.

Updated Date - 2023-08-29T17:42:19+05:30 IST