Amaravathi JAC: విజయసాయిరెడ్డి మాకు మేలే చేశారు...

ABN , First Publish Date - 2023-02-11T14:52:29+05:30 IST

అమరావతి ఉద్యమం, భవిష్యత్తు కార్యాచరణ, న్యాయ పోరాటంపై శనివారం గుంటూరులో అమరావతి జేఏసీ (Amaravathi JAC) నేతలు సమావేశమయ్యారు.

Amaravathi JAC: విజయసాయిరెడ్డి మాకు మేలే చేశారు...

గుంటూరు జిల్లా: అమరావతి ఉద్యమం, భవిష్యత్తు కార్యాచరణ, న్యాయ పోరాటంపై శనివారం గుంటూరులో అమరావతి జేఏసీ (Amaravathi JAC) నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఏసి నేత మాదాల శ్రీనివాస్ (Madala Srinivas) మాట్లాడుతూ అమరావతి విషయంలో కేంద్ర వైఖరిపై ఇన్నాళ్లు అనుమానాలు ఉన్నాయని, కానీ విజయసాయిరెడ్డి (Vijayasaireddy) పార్లమెంటు (Parliament)లో ప్రశ్న అడిగి మాకు మేలు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధానిగా అమరావతి (Amaravathi)ని ఆమోదించినట్లు కేంద్ర ప్రభుత్వం (Central Govt.) పార్లమెంటులో ప్రకటించిందన్నారు. ఈ మేరకు కేంద్రం కూడా సుప్రీంకోర్టు (Supreme Court)లో అఫిడవిట్ ఫైల్ చేసిందన్నారు.

తమకు కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ (Sivaramakrishnan Committee) నివేదిక అమలు చేయలేదని ప్రభుత్వ సలహాదారే సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) కొత్త పల్లవి అందుకున్నారని.. కమిటి నివేదికతో పాటు అన్ని అంశాలు బేరీజు వేసుకొని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మల్లీ ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటి నివేదిక అమలు చేయాలన్న డిమాండ్ సరికాదన్నారు.

అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్న జగన్ (Jagan) అమరావతికి అంగీకరించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ విశాఖ రాజధాని అన్నారని శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అమరావతిలో త్వరగా ఏర్పాటయ్యేలా చూడాలని, వాటి నిర్మాణానికి అవసరమైన రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అమరావతి ఐకాస వద్ద వందల కోట్లు ఉన్నాయని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. రైతులంతా చందాలు వేసుకుని న్యాయ పోరాటం చేస్తున్నామని మాదాల శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-11T14:52:33+05:30 IST