Share News

YCP: విజయసాయి రెడ్డి ఎదుటే మరోసారి బయటపడ్డ వైసీపీ వర్గ విభేదాలు

ABN , Publish Date - Dec 26 , 2023 | 05:25 PM

రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి గూడూరు మీదుగా నెల్లూరు వెళ్తున్న వైసీపీ రీజినల్ కో-ఆర్డీనేటర్ విజయ్ సాయి రెడ్డిని గూడూరు మినీ బైపాస్‌లో ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్యతో వైసీపీ శ్రేణులు కలిశాయి. కలివేటి సంజీవయ్యకే టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు.

YCP: విజయసాయి రెడ్డి ఎదుటే మరోసారి బయటపడ్డ వైసీపీ వర్గ విభేదాలు

గూడూరు: రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి గూడూరు మీదుగా నెల్లూరు వెళ్తున్న వైసీపీ రీజినల్ కో-ఆర్డీనేటర్ విజయ్ సాయి రెడ్డిని గూడూరు మినీ బైపాస్‌లో ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్యతో వైసీపీ శ్రేణులు కలిశాయి. కలివేటి సంజీవయ్యకే టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు.

కలివేటి సంజీవయ్యకు టికెట్ ఇవ్వొద్దని మరో వర్గం నినాదాలు చేయడంతో కాసేపు గందరగోళం నెలకొంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో విభేదాలు వాస్తవమే, అసభ్య పదజాలంతో విమర్శలు చేసుకోవడం మంచిది కాదని, అభ్యర్థి ఎంపిక విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిదే నిర్ణయమని వారికి విజయ్ సాయిరెడ్డి స్పష్టంగా చెప్పారు.

Updated Date - Dec 26 , 2023 | 05:30 PM