Anam Ramanaraya Reddy: త్వరలో భవిష్యత్‌ రాజకీయ నిర్ణయం: ఆనం రామనారాయణరెడ్డి

ABN , First Publish Date - 2023-02-20T21:28:32+05:30 IST

భవిష్యత్‌ రాజకీయ నిర్ణయానికి ఇంకా సమయం ఉంది. బడ్జెట్‌ సమావేశాలు మార్చి 15 తరువాత మధ్యంతర ఎన్నికలు వస్తాయా.. సాధారణ ఎన్నికల అనేది చూడాలి.

Anam Ramanaraya Reddy: త్వరలో భవిష్యత్‌ రాజకీయ నిర్ణయం: ఆనం రామనారాయణరెడ్డి

ఆత్మకూరు: ‘‘భవిష్యత్‌ రాజకీయ నిర్ణయానికి ఇంకా సమయం ఉంది. బడ్జెట్‌ సమావేశాలు మార్చి 15 తరువాత మధ్యంతర ఎన్నికలు వస్తాయా.. సాధారణ ఎన్నికల అనేది చూడాలి. ప్రస్తుతం నేను ఉన్న పార్టీ అయినా నన్ను తొలిగించాలి.. లేదా నేను అయినా వదులుకోవాలి.. ఈ రెండు జరగని దానికి ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదు. 1993 జనవరి 9న ఎన్టీరామారావు సారధ్యంలో ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం చేశా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పార్టీకి దూరమయ్యాం.. ప్రస్తుతం క్షణికావేశాలతో నిర్ణయం తీసుకోను. త్వరలో భవిష్యత్‌ రాజకీయ నిర్ణయం ప్రకటిస్తా’’నని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanaraya Reddy) తెలిపారు.

ఆత్మకూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న బడ్జెట్‌ (Budget) సమావేశాల అనంతరం సరైన రాజకీయ నిర్ణయంతో ముందుకు సాగుతామని తెలిపారు. రాజ్యాంగేతర శక్తులతో రాజ్యాంగాన్ని నడపాలనుకోవడం, పరిపాలనలో కాలయాపన చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టు అని అన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే హక్కులను ఎవరూ హరించలేరని తెలిపారు. ఆత్మకూరులో తానెప్పుడూ రాజ్యాంగేతర శక్తిగా పనిచేయలేదన్నారు. పదేళ్లకు ముందు తాను వదిలిపోయిన అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయో ఆత్మకూరులో ఇప్పుడూ అలానే ఉన్నాయన్నారు. దశాబ్దాల కాలంగా ప్రజల ఆశీస్సులతోనే రాజకీయాల్లో కొనసాగుతూ తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏది జరిగినా మన మంచికేనని.. ఒకటి కోల్పోతే అంతకన్నా విలువైనదే పొందవచ్చన్నది తనకు అనుభం అన్నారు. తాను ఎక్కడ ఉన్నా తన అభిమానులు, ప్రజలు వెన్నంటే ఉంటారని, ఆత్మకూరులో కూడా అభిమానులు వెంటే ఉన్నారని రామనారాయణరెడ్డి తెలిపారు.

Updated Date - 2023-02-20T21:28:33+05:30 IST