AP Assembly: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లపై ప్రశ్న.. మంత్రి ధర్మాన సమాధానం ఇదే..

ABN , First Publish Date - 2023-09-26T10:20:12+05:30 IST

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్ రిజిష్ట్రేషన్లపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సమాధానం ఇచ్చారు.

AP Assembly: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లపై ప్రశ్న.. మంత్రి ధర్మాన సమాధానం ఇదే..

అమరావతి: ఏపీ అసెంబ్లీలో (AP Assembly Session) ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు (Minister Dharmana Prasad rao) సమాధానం ఇచ్చారు. ప్రభుత్వాలు వస్తున్న సాకేతికపరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటాయని తెలిపారు. రిజిస్ట్రేషన్లలో విప్లవాత్మక మార్పును తెచ్చామన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లలో ఫోర్జరీ అనేది కంట్రోల్ అయిపోతుందని చెప్పారు. ఇచ్చిన కాపీపత్రం డూప్లికేట్ అనడానికి లేదని.... అదే ఒరిజినల్ దానికి బ్యాంకులు కూడా అంగీకరిస్తాయన్నారు. దానిపై ఆ మేరకు చట్టం కూడా తీసుకువచ్చే విధానం తీసుకొచ్చామన్నారు. దీనిలో అనేక ప్రయోజనం ఉన్నాయి కాబట్టే కనుకే తీసుకున్నామని.. ఎవ్వరికి ఎలాంటి అపోహలు వద్దని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-26T10:20:12+05:30 IST