Former CJI NV Ramana: అల్లు అర్జున్‌కు మాజీ సీజేఐ ఎన్‌వీ రమణ అభినందనలు

ABN , First Publish Date - 2023-08-26T22:07:55+05:30 IST

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు (Allu Arjun) మాజీ సీజేఐ ఎన్‌వీ రమణ (Former CJI NV Ramana) అభినందనలు తెలిపారు.

Former CJI NV Ramana: అల్లు అర్జున్‌కు మాజీ సీజేఐ ఎన్‌వీ రమణ అభినందనలు

ఢిల్లీ: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు (Allu Arjun) మాజీ సీజేఐ ఎన్‌వీ రమణ (Former CJI NV Ramana) అభినందనలు తెలిపారు.

"తెలుగు సినిమా రంగం నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన తొలి కథానాయకుడు అల్లు అర్జున్‌కు అభినందనలు. ఈ అత్యున్నత పురస్కారం ద్వారా తాత, తండ్రి, మామలతోపాటు, తెలుగు సినిమా కీర్తికి మరింత వన్నెతెచ్చారు. జాతీయస్థాయిలో తెలుగు సినిమా వైభవ పతాకాన్ని రెపరెపలాడించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు గర్వించేలా చేశారు. ఇష్టంతో కష్టపడి గంగోత్రి నుంచి పుష్పా దాకా ఇంతింతై వటుడింతై అని మీరు ఎదిగిన క్రమం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. అల్లురామలింగయ్య వారసుడిగా వచ్చి తెలుగు సినీ పరిశ్రమను మీరు అల్లుకుపోయిన తీరు అబ్బురం. నాట్యం, నటనలో రాణించి ఆ అర్జునుడిలా సవ్యసాచి అని నిరూపించుకున్న ఈ అర్జున్‌కు అభినందనలు తెలుపుతున్నా." అని మాజీ సీజేఐ ఎన్‌వీ రమణ చెప్పారు.

Updated Date - 2023-08-26T22:22:25+05:30 IST