Yanamala: బడ్జెట్ బాగుందని బుగ్గన... నిరాశాజనకంగా ఉందని ఎంపీ మిథున్ రెడ్డి..

ABN , First Publish Date - 2023-02-02T13:01:47+05:30 IST

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Yanamala: బడ్జెట్ బాగుందని బుగ్గన... నిరాశాజనకంగా ఉందని ఎంపీ మిథున్ రెడ్డి..

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్ర బడ్జెట్ (Central Budget) బాగుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) ప్రకటిస్తే... నిరాశాజనకంగా ఉందని ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) అంటున్నారన్నారు. బడ్జెట్‌పై ఆ మాత్రం అవగాహన లేకుండా వైసీపీ నాయకులు (TCP Leaders) మాట్లాడుతున్నారని అన్నారు. రైతులు, మహిళలకు చేయూత పథకాల కేటాయింపు.. కొంత వెనకబాటు తనం వైసీపీ నాయకులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం..

వైసీపీకి 32 మంది ఎంపీలు ఉండి.. ప్రత్యేకహోదా (Special Status), పోలవరం (Polavaram)పై కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నా ఎందుకు నోరు మెదపలేకతున్నారని యనమల రామకృష్ణడు ప్రశ్నించారు. జీఎస్‌డీపీ (GSDP)లో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలబెట్టామన్న సీఎం జగన్ (CM Jagan) మాట్లాడటం నలుగురిలో తాను నవ్వుల పాలవ్వడమే కాకుండా మొత్తం రాష్ట్రాన్నే నవ్వులపాలు చేశారని దుయ్యబట్టారు. వృద్ది రేటు, సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. బోగస్ కబుర్లు, దొంగలెక్కలు మానుకోవాలని సూచించారు. వాస్తవాలను చర్చించే ధైర్యముంటే ముందుకు రావాలన్నారు. గత నాలుగేళ్లలో ఏపీ జీఎస్‌డీపీ వృద్ధిరేటును మైనస్ నాలుగుకు దిగజార్చారని, అన్ని రంగాలను తిరోగమనంలోకి నెట్టారని విమర్శించారు. పేదల సంక్షేమ పథకాలు 39 రద్దు చేయడమా దేశానికే ఆదర్శం..?.. టీడీపీ పాలనలో రెండంకెల వృద్ధిని దిగజార్చడమేనా జగన్ చెప్పే వృద్ధి..? అంటూ యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

Updated Date - 2023-02-02T13:01:52+05:30 IST