Share News

Yuvagalam: ముమ్మడివరం నుంచి లోకేష్ పాదయాత్ర..

ABN , First Publish Date - 2023-11-29T08:42:54+05:30 IST

తూ.గో.జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునఃప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. రైతుల సమస్యలను తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు.

Yuvagalam: ముమ్మడివరం నుంచి లోకేష్ పాదయాత్ర..

తూ.గో.జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునఃప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. రైతుల సమస్యలను తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు. బుధవారం 212వ రోజు పాదయాత్ర ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజి వద్ద నుంచి ప్రారంభంకానుంది.

లోకేష్ యువగళం వివరాలు

- ఉదయం 10.00 గంటలకు ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజి వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.

- 10.15 – ముమ్మడివరం కొండమ్మ చింత సెంటర్‌లో డ్వాక్రామహిళలతో భేటీ.

- 10.30 – ముమ్మడివరం ఎన్టీఆర్, బాలయోగి విగ్రహాల వద్ద గౌడలతో సమావేశం.

- 11.00 – ముమ్మడివరం సెంటర్‌లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.

- 12.45 – ముమ్ముడివరం పల్లెపాలెం సెంటర్‌లో దళితులతో సమావేశం.

- 1.30 – కొమనాపల్లి సెంటర్‌లో స్థానికులతో సమావేశం.

- 2.30 – అన్నంపల్లి సెంటర్‌లో మాదిగ సామాజికవర్గీయులతో భేటీ.

- 3.30 – మురమళ్ల సెంటర్‌లో బుడగ జంగాలతో సమావేశం.

- 3.45 – మురమళ్లలో భోజన విరామం.

ఈ వార్త కూడా చదవండి.. 3 నెలలు ఓపిక పట్టండి

సాయంత్రం

- 5.00 – మురమళ్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.

- 6.00 – కొమరగిరిలో స్థానికులతో సమావేశం.

- 7.15 – ఎదుర్లంక సెంటర్‌లో స్థానికులతో సమావేశం.

- 7.30 – పాత ఇంజరం వద్ద పాదయాత్ర 2900 కి.మీ.లకు చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.

- రాత్రి 9.00 గంటలకు సుంకరపాలెం విడిది కేంద్రంలో లేకేష్ బస చేస్తారు.

Updated Date - 2023-11-29T08:44:55+05:30 IST