MLA Gorantla: పైబర్ నెట్‌లో అవకతవకలు జరగలేదు

ABN , First Publish Date - 2023-09-28T14:05:43+05:30 IST

రాజమండ్రి: పైబర్ నెట్‌లో అవకతవకలు జరగలేదని, 149 రూపాయలు ఉన్న పైబర్ కనెక్షన్‌ను జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 450కు పెంచారని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

MLA Gorantla: పైబర్ నెట్‌లో అవకతవకలు జరగలేదు

రాజమండ్రి: పైబర్ నెట్‌ (Piber Net)లో అవకతవకలు జరగలేదని, 149 రూపాయలు ఉన్న పైబర్ కనెక్షన్‌ను జగన్ (Jagan) అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 450కు పెంచారని టీడీపీ సీనియర్ నేత (TDP Senior Leader), ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Gorantla Butchaiah Chaudhary) అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో ఆధారాలు చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారని, తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా భయపడమని హెచ్చరించారు. నియంత ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ప్రస్తుతం పోరాటం జరుగుతోందన్నారు. ప్రజా తిరుగుబాటుతో వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) కుప్పకూలిపోతుందన్నారు. చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), లోకేష్‌ (Lokesh)లపై హత్య నేరం కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. హౌస్ అరెస్టులు చేసే అదికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేయలేదని, న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులంటే తనకు గౌరవం అని అన్నారు. సీఎం జగన్ వ్యవస్థలను మోసం చేస్తున్నారని, 12 సంవత్సరాలుగా బెయిల్‌పై తిరుగుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

Updated Date - 2023-09-28T14:05:43+05:30 IST