Share News

CM JAGAN : డిసెంబర్ 8న భీమవరంలో సీఎం జగన్ పర్యటన

ABN , First Publish Date - 2023-11-27T19:01:23+05:30 IST

డిసెంబర్ 8వ తేదీన భీమవరం ( Bhimavaram ) లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) పర్యటించనున్నారు. ఈమేరకు సీఎం టూర్ షెడ్యూల్ ఖరారయింది.

CM JAGAN : డిసెంబర్ 8న భీమవరంలో  సీఎం జగన్ పర్యటన

భీమవరం: డిసెంబర్ 8వ తేదీన భీమవరం ( Bhimavaram ) లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) పర్యటించనున్నారు. ఈమేరకు సీఎం టూర్ షెడ్యూల్ ఖరారయింది. భీమవరం బహిరంగ సభ నుంచి ముఖ్యమంత్రి జగన్ విద్యాదీవెన నిధులను విడుదల చేయనున్నారు. హెలిపాడ్, బహిరంగ సభ ప్రదేశాలకు పలు ప్రాంతాను అధికారులు, వైసీపీ నాయకులు పరిశీలిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప యాత్రలో సీఎం జగన్ భీమవరం వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భీమవరంలో అధికారికంగా జరిగే ఈ పర్యటన విజయవంతం చేయడానికి వైసీపీ నాయకులు పకడ్బందీగా ప్రణాళిక‌ రూపొందిస్తున్నారు.

Updated Date - 2023-11-27T19:01:39+05:30 IST