Magunta Ragahava: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు.. ఈసారి ఈడీ కూడా..

ABN , First Publish Date - 2023-07-18T11:27:00+05:30 IST

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలపై మాగుంటకు నాలుగు వారాల పాటు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

Magunta Ragahava: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు.. ఈసారి ఈడీ కూడా..

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Srinivasulu Reddy) కుమారుడు మాగుంట రాఘవకు (Magunta Raghava) ఢిల్లీ హైకోర్టు (Delhi High court) బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలపై మాగుంటకు నాలుగు వారాల పాటు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈసారి రాఘవకు బెయిల్ ఇవ్వడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించలేదు. గతంలో ఢిల్లీ హైకోర్టు రాఘవకు బెయిల్ ఇవ్వగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా.. ఈరోజు మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని మాత్రం ఈడీ వ్యతిరేకించలేదు. విచారణకు ఎప్పుడు పిలిచినా ఈడీ ముందు హాజరుకావాలని రాఘవను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ లేదా చెన్నై కార్యాలయాల్లో విచారణకు హాజరుకావచ్చని తెలిపింది. చెన్నై వదిలి వెళ్లవద్దని ఢిల్లీ హైకోర్టు షరతు విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా రాఘవను ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది. మరోవైపు ఈడీ కేసులో త్వరలో దినేష్ అరోరా అప్రవర్‌గా మారనున్నారు. గతంలో సీబీతఐ కేసులో దినేష్ అరోరా అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-07-18T12:03:38+05:30 IST