Tirumala: టీడీపీ జైత్రయాత్ర ప్రారంభమైంది: కంచర్ల శ్రీకాంత్

ABN , First Publish Date - 2023-03-19T13:07:46+05:30 IST

తిరుమల: ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మార్పుకి నాంది పలికారని, ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో టీడీపీ జైత్రయాత్ర ప్రారంభమైందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు.

Tirumala: టీడీపీ జైత్రయాత్ర ప్రారంభమైంది: కంచర్ల శ్రీకాంత్

తిరుమల: ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh State)లో ప్రజలు మార్పుకి నాంది పలికారని, ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో టీడీపీ జైత్రయాత్ర (TDP Jaitrayatra) ప్రారంభమైందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ (MLC Kancharla Srikanth) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ జైత్రయాత్ర కోనసాగుతుందన్నారు. తన విజయాన్ని నారా లోకేష్‌ (Nara Lokesh)కు అంకితం చేస్తున్నానన్నారు. వైకాపాతో సహ అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలను సెమిఫైనల్స్‌ (Semifinals)గా పేర్కొన్నాయన్నారు. సెమిపైనల్స్‌లో విజయం సాధించిన టీడీపీ.. ఫైనల్స్‌లో కూడా విజయం సాధిస్తుందన్నారు. పులివెందులతో సహ అన్ని నియోజకవర్గాలలో పట్టభద్రులు వైసీపీ (YCP)కి వ్యతిరేకంగా ఓటు వేశారని.. ప్రభుత్వంపై ప్రజలలో నెలకొన్న వ్యతిరేకతకు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా ఇంజనీరింగ్‌, ఎంబీఏ చేసి హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్‌(యూఎస్)గా వ్యవహరిస్తున్న కంచర్ల శ్రీకాంత్‌ తూర్పు రాయలసీమ పట్టుభద్రుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. తండ్రి కంచర్ల రామయ్య మాజీ జర్నలిస్టు. ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజ్‌ కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. తల్లి కంచర్ల ధనలక్ష్మి... గృహిణి. భార్య సరిత, ఇద్దరు కుమారులు. ప్రకాశం ఎడ్యుకేషన్‌ గ్రూప్‌ డైరెక్టర్‌గా, అమ్మ ఎడ్యుకేషన్‌ సొసైటీ కోశాధికారిగా, కంచర్ల పౌండేషన్‌ వ్యవస్థాపకునిగా, ఇగ్నైట్‌ ఇన్నోవేషన్స్‌ (ప్రై)లిమిటెడ్‌ ఎండీగా, రామ్‌సన్స్‌ సోలార్‌ అండ్‌ ఎవెన్యూస్ (ప్రై) లిమిటెడ్‌ ఎండీగా ఆయన వ్యవహరిస్తున్నారు. 2008లో తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా బాధ్యతలు తలకెత్తుకున్నారు. ప్రస్తుతం ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తూ ఎమ్మెల్సీగా గెలిచారు.

Updated Date - 2023-03-19T13:07:46+05:30 IST