Chittoor: పాదయాత్రలో లోకేష్‌ను కలిసిన న్యాయవాదులు...

ABN , First Publish Date - 2023-02-02T14:18:22+05:30 IST

చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ‘‘యువగళం’’ పాదయాత్ర (Padayatra) విజయవంతంగా ముందుకు సాగుతోంది.

Chittoor: పాదయాత్రలో లోకేష్‌ను కలిసిన న్యాయవాదులు...

చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ‘‘యువగళం’’ పాదయాత్ర (Padayatra) విజయవంతంగా ముందుకు సాగుతోంది. పాదయాత్రకు ప్రజలు, మహిళల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అభిమానులు, టీడీపీ శ్రేణులతో సెల్ఫీలు (Selfie) దిగుతూ లోకేష్ ఉత్సాహంగా పాదయాత్ర చేస్తున్నారు. గురువారం ఉదయం రామాపురం ఎమ్మోస్ హాస్పటల్ ఎదుట విడిది కేంద్రం నుంచి లోకేష్ 7వ రోజు పాద‌యాత్ర ప్రారంభించారు. ప్రతి రోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి నారా లోకేష్ సెల్ఫీలు దిగుతున్నారు. యువనేత ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వేధింపులు, కక్ష సాధింపులు

పలమనేరు పాదయాత్రలో లోకేష్‌ను న్యాయవాదులు కలిసి సమస్యలను వివరించారు. స్థానిక ఎమ్మెల్యే మోసం చేశారని లోకేష్‌ దృష్టికి తెచ్చారు. స్థలం కేటాయించామని చెప్పి.. ఎవరికీ తెలియకుండా..ఎమ్మెల్యే అమ్మేసుకున్నారని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించిన లోకేష్.. అధికారంలోకి రాగానే ఇళ్ల పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. ఇదే అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెడతామన్నారు. పలమనేరులో అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

అంతకుముందు లోకేష్ రామాపురంలో ఆర్యవైశ్య సామాజికవర్గం (Arya Vaishya community) ప్రతినిధులతో భేటీ అయ్యారు. జగన్ ప్రభుత్వం (Jagan Government)వచ్చిన తరువాత ఆర్య వైశ్యులను భయబ్రాంతులకు గురిచేస్తోందని ప్రతినిధులు తెలిపారు. వైసీపీ నాయకుల (YCPLeaders) వేధింపులకు ఆర్య వైశ్యులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకోలేని స్థితి ఉందని.... జే ట్యాక్స్ కట్టలేక వ్యాపారాలు వదులుకుంటున్నామని ఆర్యవైశ్య సామాజివర్గం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై స్పందించిన లోకేష్ మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో ఆర్య వైశ్యులకు పెద్ద పీట వేశామన్నారు. ఆర్య వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, రూ. 30 కోట్ల నిధులు ఇచ్చామని చెప్పారు. 2014 నుండి 2019 వరకూ మంత్రి, రాజ్యసభ, నలుగురు కార్పొరేషన్ చైర్మన్లు, 7 గురు మున్సిపల్ చైర్మన్లు, 5 గురు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పదవులు ఇచ్చామన్నారు. అందరికీ సమ న్యాయం టీడీపీ విధానమని, ఆర్య వైశ్యులను ఎప్పుడూ వేధించలేదన్నారు.

వైసీపీ పాలనలో ఆర్య వైశ్యులను వేధిస్తున్నారని, జే ట్యాక్స్ పేరుతో హింసించి చంపేస్తున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పరిపాలనలో కన్యకా పరమేశ్వరి ఆలయాల్ని ధ్వంసం చేస్తున్నారని, ఆర్య వైశ్యులకు ఉన్న మంత్రి పదవి కూడా పీకేశారన్నారు. కార్పొరేషన్‌కు నిధులు ఇవ్వడం లేదని, జగన్ చంపేసిన ఆర్య వైశ్య కార్పొరేషన్‌ను టీడీపీ అధికారంలోకి రాగానే యాక్టివేట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్య వైశ్యులు అర్దికంగానూ, రాజకీయంగానూ ఎదిగేందుకు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఆర్య వైశ్యుల్లో ఉన్న పేద వారిని అన్ని విధాలా ఆదుకుంటామని నారా లోకేష్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-02T14:18:26+05:30 IST