Chittoor Dist.: గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్సీ భర్తకు నిరసన సెగలు

ABN , First Publish Date - 2023-04-21T12:16:26+05:30 IST

చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో గడపగడపకు కార్యక్రమం (Gadapagadapaku Program)లో ఎమ్మెల్సీ భర్తకు ప్రజల నుంచి నిరసన సెగలు తగిలాయి.

Chittoor Dist.: గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్సీ భర్తకు నిరసన సెగలు

చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో గడపగడపకు కార్యక్రమం (Gadapagadapaku Program)లో ఎమ్మెల్సీ భర్తకు ప్రజల నుంచి నిరసన సెగలు తగిలాయి. నూలుకుంట గ్రామానికి వెళ్లిన భరత్‌ను గ్రామస్తులు నిలదీశారు. నాలుగేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) తమ గ్రామానికి ఏమి చేసిందో చెప్పాలని స్థానికులు నిలదీశారు. భరత్‌తో పాటు వెంట వచ్చిన జడ్పీటీసీ (ZPTC) గ్రామస్తులపై ఎదురు దాడి చేశారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababunaidu) కుప్పానికి ఏం చేశారో చెప్పాలంటూ ఎదురుదాడికి దిగడంతో గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

అలాగే కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే, సీఎం జగన్‌ (CM Jagan) మేనమామ రవీంద్రనాథరెడ్డి (Ravindranatha Reddy)కి నిరసన సెగ తాకింది. ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారని తెలిసి ఊరు ఊరంతా ఇళ్లకు తాళాలు వేసుకుని బయటకు వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే... గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం కమలాపురం మండలం దేవరాజుపల్లెలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొంటున్న విషయం తెలుసుకున్న ఆ ఊరివాసులు నివాసాలపై టీడీపీ జెండాలు కట్టి, ఇళ్లకు తాళాలు వేసుకుని బయటకు వెళ్లిపోయారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి స్వగ్రామమైన మాచిరెడ్డిపల్లెకు ఈ గ్రామం కూతవేటు దూరంలో ఉంది. ఇక్కడ మొత్తం మూడు కాలనీలు ఉన్నాయి. ఈ మూడు కాలనీల్లో సుమారు 1,600 ఓట్లు ఉన్నాయి. వీరిలో చాలామంది ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ బయటకు వెళ్లిపోయారు. గ్రామంలో ఉన్న కొద్దిమంది ఇళ్ల వద్దకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎమ్మెల్యే వెళ్లారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. పుత్తా స్వగ్రామానికి అత్యంత సమీపంలోని ఊరు కావడంతో గొడవలు జరుగుతాయేమోనన్న అనుమానంతో కమలాపురం, వీఎన్‌పల్లె, వల్లూరు ఎస్‌ఐలు భద్రతా చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-04-21T12:16:26+05:30 IST