Chitntamohan: చంద్రబాబు చాలా భయస్తుడు.. తమ్ముడికి సహాయం చేయడానికి కూడా...

ABN , First Publish Date - 2023-09-23T13:30:36+05:30 IST

అసెంబ్లీలో స్పీకర్‌పైన ఎమ్మెల్యేలకు నమ్మకం లేదని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు జైల్లో.... జగన్ బెయిల్‌పై ఉన్నారని వ్యాఖ్యలు చేశారు.

Chitntamohan: చంద్రబాబు చాలా భయస్తుడు.. తమ్ముడికి సహాయం చేయడానికి కూడా...

తిరుపతి: అసెంబ్లీలో స్పీకర్‌పైన ఎమ్మెల్యేలకు నమ్మకం లేదని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ (Former Union Minister Chinta Mohan) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు (TDP Chief Chandrababu) జైల్లో.... జగన్ బెయిల్‌పై ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. మహిళ రిజర్వేషన్‌పై బీజేపీ చేస్తున్నది మ్యాజిక్ అని.... నమ్మడానికి ఏమీ లేదని.. ఎన్నికల స్టంట్ అని విమర్శించారు. మహిళ రిజర్వేషన్ టీటీడీలోను, సుప్రీంకోర్టు జడ్డ్ నియామకాల్లోనూ, ఐఏఎస్‌లో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 17వేల కోట్ల టీటీడీ నిధులు, బంగారం నిల్వలు ఎక్కడ పోయాయో టీటీడీ అధికారులు చెప్పాలన్నారు. రూ.17వేల కోట్లను వడ్డీ కోసం ఇచ్చామంటున్నారని.. అది ఎక్కడ ఇచ్చారంటే మాత్రం టీటీడీ నుంచి సమాధానం లేదని అన్నారు. 49 ఏళ్ళుగా చంద్రబాబు తనకు తెలుసని.. ఆయన చాలా భయస్తుడని తెలిపారు. సొంత తమ్ముడుకి మేలు చేసినా జనాలు ఏమి అనుకుంటారో అని సహాయం చేయకుండా ఉండే నైజం చంద్రబాబుది అని అన్నారు. వ్యక్తిగత కక్ష రాజకీయాలు మంచి కాదన్నారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఎంతో కలిసి మెలసి ఉండేవారని చెప్పారు. అనుభవం లేకపోవడం వల్ల జగన్ ఇలాంటి చర్యలు తీసుకున్నారన్నారు. వైసీపీ తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకే అనుకూలంగా మారిందని చింతామోహన్ వెల్లడించారు.

Updated Date - 2023-09-23T13:31:01+05:30 IST