Share News

AP NEWS: చిత్తూరు జిల్లాలో శవంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసన

ABN , First Publish Date - 2023-11-20T20:35:42+05:30 IST

జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం రెవెన్యూ కార్యాలయం వద్ద రోడ్డుపై శవంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసన తెలిపారు. కమ్మపల్లి గ్రామానికి శ్మశాన వాటిక వివాదంతో చెంగల్ రాయ ఆచారి శవంతో గ్రామస్తులు ధర్నా చేశారు.

AP NEWS: చిత్తూరు జిల్లాలో శవంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసన

చిత్తూరు : జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం రెవెన్యూ కార్యాలయం వద్ద రోడ్డుపై శవంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసన తెలిపారు. కమ్మపల్లి గ్రామానికి శ్మశాన వాటిక వివాదంతో చెంగల్ రాయ ఆచారి శవంతో గ్రామస్తులు ధర్నా చేశారు. శ్మశాన వాటిక స్థలం తనదంటూ వీఆర్ఏ గంగులప్పా అడ్డుకున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూమిని శ్మశాన వాటికగా గ్రామస్థులు వినియోగిస్తామంటున్నారు. వీఆర్ఏ గంగులప్ప తన పేరుపై పట్టా పొందడంతో ఈ వివాదం చెలరేగింది. గంటపాటుగా నిరసన జరగడంతో బైరెడ్డిపల్లి పుంగనూరు రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. న్యాయం చేస్తామని ధర్నాను పోలీసులు విరమింప చేశారు.

Updated Date - 2023-11-20T20:35:43+05:30 IST