AP News: సీఎం జగన్ ఇదిగో..ఇలా లబ్దిపొందుతున్నారు: కేంద్రమంత్రి

ABN , First Publish Date - 2023-04-18T19:31:32+05:30 IST

కేంద్ర పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) పెద్ద పెద్ద ఫోటోలు వేసుకుని సొంత పథకాలుగా ప్రచారం చేసుకుని లబ్దిపొందుతున్నారని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్ (Devisingh Chauhan) అన్నారు.

AP News: సీఎం జగన్ ఇదిగో..ఇలా లబ్దిపొందుతున్నారు: కేంద్రమంత్రి

తిరుపతి: కేంద్ర పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) పెద్ద పెద్ద ఫోటోలు వేసుకుని సొంత పథకాలుగా ప్రచారం చేసుకుని లబ్దిపొందుతున్నారని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్ (Devisingh Chauhan) అన్నారు. కేంద్ర పథకాల నిధులను పూర్తిగా దారిమల్లించి పూర్తిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వ ధనాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు. పార్టీ నేతలకు , కార్యకర్తలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నవాలంటీర్లు ప్రజలను తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. క్రింది స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలను అన్నింటినీ నిర్వీర్యం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథం నుంచి దివాళా స్థాయికి చేరిందని ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-04-18T19:31:34+05:30 IST