AP MLC Results: గెలిచిన టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు అభినందనలు

ABN , First Publish Date - 2023-03-18T21:47:58+05:30 IST

మూడు పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) అభినందనలు తెలిపారు. అలాగే గెలిపించిన ప్రజలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

AP MLC Results: గెలిచిన టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు అభినందనలు

అమరావతి: మూడు పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) అభినందనలు తెలిపారు. అలాగే గెలిపించిన ప్రజలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన పార్టీ శ్రేణులకు సెల్యూట్‌ చెప్పారు. ఈ ఫలితాలు.. ప్రజా విజయం, మార్పునకు సంకేతమని ప్రకటించారు. ఈ ఫలితాలు.. మంచికి మార్గం, ఏపీకి శుభసూచకమని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థులకు మాజీమంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అభినందనలు తెలిపారు. ఇది సైకో పాల‌న‌పై ప్రజావిజ‌యమని అభివర్ణించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని యువత తొక్కిపట్టి నార తీశారని ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna) అన్నారు. ఈ ఫలితాలు ఏపీకి టీడీపీ పాలన ఎంత అవసరమో తెలియజేస్తున్నాయని వ్యాఖ్యానించారు. 3 ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలతో పులివెందుల కోటకు బీటలు పారాయని ఎద్దేవాచేశారు. ఆ బీటలు త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace) వరకు చేరుతాయన్నారు. సీఎం జగన్ తాత దిగొచ్చినా దాన్ని కాపాడుకోవటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ‘వైనాట్ 175’ అని జగన్ ఇప్పుడంటే వినాలని ఉందంటూ బాలకృష్ణ సెటైర్లు వేశారు.

రాష్ట్రంలో జరిగిన మూడు పట్టభద్రుల స్ధానాలను టీడీపీ కైవసం చేసుకుంది. రాయలసీమ తూర్పు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో (Rayalaseema East Graduate Constituency Election) టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ (TDP candidate Kancharla Srikanth), ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక (MLC election of Uttarandhra graduates)ల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు (TDP candidate Vepada Chirajeevi Rao) విజయదుందుభి మోగించారు. పశ్చిమ రాయలసీమ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (Bhumi Reddy Ramgopal Reddy) వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7,543 ఓట్ల మోజార్టీలో విజయం సాధించారు. పులివెందులలో 40 ఏళ్ల చరిత్రను సైకిల్‌ తిరగరాసింది.

Updated Date - 2023-03-18T21:47:58+05:30 IST