Chintakayala Vijay: మొన్న 68 ప్రశ్నలు.. ఇవాళ 42 ప్రశ్నలు.. 7 గంటల పాటు చింతకాయల విజయ్‌ని ప్రశ్నించిన సీబీఐ

ABN , First Publish Date - 2023-02-16T19:29:57+05:30 IST

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ (Chintakayala Vijay) సీఐడీ విచారణ ముగిసింది. ఏడు గంటల పాటు విజయ్‌ను సీఐడీ (CBI) అధికారులు విచారించారు.

Chintakayala Vijay: మొన్న 68 ప్రశ్నలు.. ఇవాళ 42 ప్రశ్నలు.. 7 గంటల పాటు చింతకాయల విజయ్‌ని ప్రశ్నించిన సీబీఐ

గుంటూరు: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ (Chintakayala Vijay) సీఐడీ విచారణ ముగిసింది. ఏడు గంటల పాటు విజయ్‌ను సీఐడీ (CBI) అధికారులు విచారించారు. విచారణ అనంతర విజయ్ మీడియాతో మాట్లాడుతూ రెండోసారి సీఐడీ విచారణకు వెళ్లానని తెలిపారు. మొన్న 68 ప్రశ్నలు,.. ఇవాళ 42 ప్రశ్నలు వేశారని, అన్ని ప్రశ్నలకు సమధానాలు చెప్పానని తెలిపారు. హైకోర్టులో కూడా దీనిపై విచారణ జరుగనుందన్నారు. గతంలో టీడీపీ (TDP) గ్రామస్థాయి నిర్మాణం వరకు వివరాలు అడిగారని పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu), ఆయన కుమారుడు లోకేష్కు సంబంధించిన అంశాలు కాకుండా.. ఫిర్యాదు ఆధారంగా అడగాలని చెప్పానని వివరించారు. ఇవాళ కేసు ఆధారమైన ప్రశ్నలు అడిగారని చింతకాయల విజయ్ వెల్లడించారు.

విజయ్‌కు 41ఏ నోటీసు

చింతకాయల విజయ్‌కు సీఐడీ అధికారులు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు జారీచేశారు. అనకాపల్లి జిల్లా (Anakapalli District) నర్సీపట్నం శివపురంలోని ఆయన ఇంటికి వచ్చి నోటీసులిచ్చారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లి పద్మావతికి నోటీసు అందజేశారు. మంగళగిరి (Mangalagiri)లోని సీఐడీ కార్యాలయంలో నమోదైన కేసుకు సంబంధించి ఈ నెల 27న విజయ్‌ అక్కడ విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరులో ‘భారతీ పే’ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనికి ఐ-టీడీపీయే కారణమంటూ దానికి కో-కన్వీనర్‌గా ఉన్న విజయ్‌పై సీఐడీ కేసు నమోదుచేసింది. ఆయనకు 41ఏ నోటీసులివ్వడానికి సీఐడీ అధికారులు గతేడాది అక్టోబరు 1న హైదరాబాద్‌ (Hyderabad)లోని విజయ్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయి. సీఐడీ అధికారుల తీరుపై విజయ్‌ భార్య డాక్టర్‌ సువర్ణకుమారి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ నేపథ్యంలో విజయ్‌కు 41ఏ ప్రకారం నోటీసులిచ్చారు.

Updated Date - 2023-02-16T19:29:58+05:30 IST