CBI: వైఎస్ భారతి పీఏకు మరోసారి సీబీఐ నోటీసులు.. వివేకా హత్య రోజు భారతితో అవినాష్ రెడ్డి మాట్లాడినట్లు..

ABN , First Publish Date - 2023-03-02T23:20:37+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనంగా మారిన ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సతిమణి వైఎస్ భారతి (YS Bharti) పీఏ నవీన్కు (YS Bharti PA Naveen) మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.

CBI: వైఎస్ భారతి పీఏకు మరోసారి సీబీఐ నోటీసులు.. వివేకా హత్య రోజు భారతితో అవినాష్ రెడ్డి మాట్లాడినట్లు..

కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనంగా మారిన ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సతీమణి వైఎస్ భారతి (YS Bharti) పీఏ నవీన్కు (YS Bharti PA Naveen) మరోసారి సీబీఐ (CBI) అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. రెండురోజుల్లో నవీన్ను సీబీఐ అధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గత నెలలో నవీన్ను కడపలో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. నవీన్‌కు సంబంధించిన అడ్వకెట్ సీబీఐ అధికారులను కలిశారు. గతంలో నవీన్‌ను సీబీఐ అధికారులు విచారించినప్పుడు కుటుంబానికి సంబంధించిన వివరాలు మొత్తం తీసుకోలేకపోయారని తెలుస్తోంది.

సీబీఐ ఎదుట నవీన్ హాజరుకాకుండా ఆయన అడ్వకెట్ సుదర్శన్ రెడ్డితోపాటు నవీన్ బ్రదర్ పులివెందుల నుంచి వచ్చి సీబీఐ అధికారులను కలిశాడు. ఆ వివరాలను అందించడంతోపాటు రెండురోజుల్లో నవీన్‌కు నోటీసులు ఇస్తామని, హాజరుకావాల్సిందేనని అడ్వకెట్‌కు సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నవీన్‌ను రెండోసారి విచారించే అవకాశం ఉంది. రేపో, రెల్లుండో నవీన్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చి కడపకు పిలిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. నవీన్‌ను రెండోసారి విచారించడం చాలా కీలమైందని వెల్లడవుతోంది.

cbi.jpg

భారతితో మాట్లాడేందుకు ముందుగా నవీన్‌కు ఫోన్ చేయాల్సి ఉంటుందని, నవీన్‌ ఫోన్ భారతికి ఇస్తే అప్పుడే ఆమె మాట్లాడుతుందని స్పష్టమవుతోంది. భారతితో మాట్లాడుతున్న నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి నవీన్‌కు రెండుమూడుసార్లు ఫోన్ చేసి మాట్లాడినట్లు కాల్ లిస్టులో ఉందని తెలుస్తోంది. ఆ మేరకు తొలిసారి ప్రశ్నించని కీలక విషయాలను కూడా రెండోసారి విచారణలో నవీన్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. హైదరాబాద్‌లో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. అవినాష్ రెడ్డిని విచారించిన అనంతరం ఇప్పుడు రెండోసారి నవీన్‌ను పిలిచారంటే.. అవినాష్ రెడ్డి ఏం చెప్పారు? నవీన్ ఏం చెబుతారనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద నవీన్‌ను రెండోసారి ప్రశ్నిస్తే కీలక సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2023-03-03T00:03:27+05:30 IST