Viveka Case: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంలో సీబీఐ అఫిడవిట్

ABN , First Publish Date - 2023-09-03T09:30:12+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అవినాష్ రెడ్డి (YS Avinash reddy) బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో (Supreme court) సీబీఐ (CBI) అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 11న అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్ట్‌లో విచారణ జరగనుంది. అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంలో సునీతా రెడ్డి సవాలు చేశారని ప్రస్తావించింది.

Viveka Case: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంలో సీబీఐ అఫిడవిట్

న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అవినాష్ రెడ్డి (YS Avinash reddy) బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో (Supreme court) సీబీఐ (CBI) అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 11న అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్ట్‌లో విచారణ జరగనుంది. అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంలో సునీతా రెడ్డి సవాలు చేశారని ప్రస్తావించింది. వివేకా హత్యకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలే కుట్ర చేశారంటూ అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది. రాజకీయ వైరంతోనే వివేకా హత్య జరిగిందని సీబీఐ స్పష్టం చేసింది.


గుండెపోటు అంటూ కట్టుకథ అల్లారని సీబీఐ పేర్కొంది. అవినాష్ రెడ్డి పాత్రపై ఇంకా దర్యాప్తు చేయాలని తెలిపింది. వివేకా వెంట కారులో ప్రయాణిస్తూనే నిందితుడు సునీల్‌కి గంగిరెడ్డి ఫోన్ చేశారని, ఆ సమయంలో అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నాడని వివరించింది. వివేకా హత్యకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలే సూత్రదారులు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది.

Updated Date - 2023-09-03T09:30:16+05:30 IST