MP Avinash Reddy: ఎంపీ అవినాష్‌రెడ్డిపై కేసు కొట్టివేత
ABN , First Publish Date - 2023-03-02T19:03:34+05:30 IST
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు 94 మందిపై కడప జిల్లా తొండూరు (Thondur) పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల కేసుల
విజయవాడ: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు 94 మందిపై కడప జిల్లా తొండూరు (Thondur) పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల కేసుల విచారణ న్యాయస్థానం కొట్టేసింది. 2015లో తొండూరులో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు తమను పోలీసులు చిత్రహింసలు పెట్టారని కర్నాటక సరిహద్దుల్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృతదేహాలతో ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి పలువురు తొండూరు పోలీస్‌స్టేషన్ (Thondur Police Station) ఎదుట ఆందోళన చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా అవినాష్‌రెడ్డి, ఏ2గా వైఎస్ వివేకానందరెడ్డి ఉన్నారు. ఈ కేసును ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోర్టు గురువారం కొట్టేసింది.