Satyakumar: బైజుస్ కంటెంట్‌లోనూ అవినీతి..త్వరలోనే బయటపెడతాం

ABN , First Publish Date - 2023-09-25T10:53:09+05:30 IST

స్కిల్ డెవలప్మెంట్ తరహాలోనే బైజూస్ కంటెంట్‌లో అవినీతి జరిగిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బైజుస్‌లో జరిగిన అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నామని.. త్వరలోనే కేసులు పెడుతామని అన్నారు.

Satyakumar: బైజుస్ కంటెంట్‌లోనూ అవినీతి..త్వరలోనే బయటపెడతాం

అనంతపురం: స్కిల్ డెవలప్మెంట్ (Skill development) తరహాలోనే బైజుస్ కంటెంట్‌లో (ByJu's content) అవినీతి జరిగిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (BJP National Secretary Satya Kumar) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బైజుస్‌లో జరిగిన అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నామని.. త్వరలోనే కేసులు పెడుతామని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. పాలన గాలికి వదిలేసి... పరిస్థితులు అగమ్యగోచరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించారు. అభివృద్ధి విస్మరించి... అన్ని రంగాల్లో వైఫల్యం చెందారన్నారు. 15 రోజులుగా ఎమ్మెల్యేలు, మంత్రులు వెకిలి మాటలు, వికృత చేష్టలతో ప్రజల దృష్టి మరల్చుతున్నారన్నారు. సీఎం కక్ష్య సాధింపులపై పెడుతున్న దృష్టి... వ్యవసాయం, రైతాంగం సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్నారు. ఏడు సార్లు కరెంట్ చార్జీలు పెంచారని... కరెంట్ కోతలు పెరిగాయని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో నిత్యావసరాల ధరలు ఉన్నాయన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులానే... వైసీపీ ప్రభుత్వ బైజుస్ అవినీతి కూడా బయటకు వస్తుందని చెప్పారు. ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ... జనాన్ని మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక రాష్ట్రంలో ప్రతి రోజు పోలీసు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. మహిళ అని చూడకుండా పురందేశ్వరిని (AP BJP Chief Purandeshwari) విమర్శించడం సరైంది కాదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో వ్యవహరించిన తీరును బీజేపీ ఖండిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశంలో రాష్ట్ర అంశాలపై జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. జగన్ (CM Jagan) బెయిల్ అంశం కేంద్రం ప్రభుత్వం పరిధిలోనిది కాదని... కోర్టు పరిధిలోని అంశమని చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌ను అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభరాజుతో సత్యకుమార్ పోల్చారు.


పొత్తులపై ఇప్పుడేమీ చెప్పలేం..

పొత్తుల అంశంపై బీజేపీ నేత మాట్లాడుతూ.. ఏపీలో పొత్తులపై ఇప్పుడేమీ చెప్పలేమని.. జనవరిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి నెట్టివేయబడిందన్నారు. కేవలం ప్రతిపక్షాలను అణచడానికి మాత్రమే అధికారాన్ని ఉపయోగిస్తున్నారన్నారు. ప్రభుత్వం 6 కోట్ల ఆంధ్రుల కోసం కాకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు లేవని, యువతకు ఉద్యోగాలు లేవని, ఇవన్నీ ప్రజల దృష్టి మరల్చి ఏమారిస్తున్నరని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో ప్రతిదీ కుంభకోణమే అని ఆరోపించారు. తొడలు, మీసాలు మెలేయడం కోసమా అధికారం ఇచ్చిందని నిలదీశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు‌ను అరెస్ట్ చేసి దేశమంతా తిరిగి ప్రెస్‌మీట్ పెడుతున్నారన్నారు. హత్యలు, ఆత్మహత్యలు, మహిళలపై అత్యాచారాలలో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. ‘‘ఆయన 10 ఏళ్ల నుంచి బయట తిరుగుతున్నారు.. మరి ఆయన కోర్టులను ఎలా మేనేజ్ చేస్తున్నాడో.. కోర్టులను మేనేజ్ చేయడం మేము కూడా మొదటి సారి చూస్తున్నాం. దేశంలో మేము ఇప్పటివరకు 10 ఏళ్లు బైయిల్ మీద బయట ఉండడం చూడలేదు. న్యాయ వ్యవస్థ లో సంస్కరణలు రావాలి’’ అంటూ జగన్‌ను ఉద్దేశించి సత్యకుమార్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-25T10:53:09+05:30 IST