Share News

Bhuvaneswari: జగన్ సర్కారుపై ఫైర్.. టీడీపీ- జనసేనలకు అఖండ విజయం తధ్యం

ABN , First Publish Date - 2023-10-27T17:42:33+05:30 IST

నిజం గెలవాలి బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి మాట్లాడుతూ వైసీపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bhuvaneswari: జగన్ సర్కారుపై ఫైర్.. టీడీపీ- జనసేనలకు అఖండ విజయం తధ్యం

తిరుపతి జిల్లా: నిజం గెలవాలి బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి మాట్లాడుతూ వైసీపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన తప్పు ఏమిటి? అని ప్రజలను నారా భువనేశ్వరి సూటిగా ప్రశ్నించారు.

"పోలవరం కట్టడం, అనేక పరిశ్రమలు తేవటం, ఉద్యోగాలు తేవటం, స్కిల్ డెవలప్‌మెంట్ పెట్టడం తప్పా. స్కిల్ డెవల్మెంట్ గుజరాత్ లో కూడా ఉంది. ఒక్కపుడు ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, అక్రమ కేసులు, అన్నదాతల అత్మహత్యలు, అత్యాచారాలు, భూమి దందాలు, కమిషన్ల కోసం బెదర గొట్టడం, ఆకాశంలో నిత్య అవసరాల ధరలు, రాజధాని లేని దిక్కు మొక్కు లేని రాష్ట్రం. రాజ్యాంగాన్ని అమలు చేసేవారు మంచి వారు కాకపోతే మంచి జరగదు. అమలు పరిచేవారు మంచి వారు ఐతే మంచి జరుగుతుంది అని అంబేద్కర్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి.ఈ ప్రభుత్వం పని అయిపోయింది. చంద్రబాబు బయటకు వచ్చి ఇంకా కష్టపడతారు. ధనబలం వాళ్లది, ప్రజాబలం మనది. టీడీపీ జనసేనలకు అఖండ విజయం తధ్యం. వైసీపీ వ్యవస్థలను మేనేజ్ చేస్తోంది. చంద్రబాబు ఇలాంటి సమస్యలు ఎన్నో చూశారు. ఎంతో మనోధైర్యంతో ఉన్నారు.

Updated Date - 2023-10-27T17:48:05+05:30 IST