Atchannaidu: అందుకే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు

ABN , First Publish Date - 2023-03-02T17:58:30+05:30 IST

: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy)పై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Atchannaidu: అందుకే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy)పై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో నాలుగేళ్లలో 350 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ 13వ స్థానానికి దిగజారిందన్నారు. పారిశ్రామిక రాయితీలు రూ.850 కోట్లు ఇవ్వలేదని, అచ్చెన్న, నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. నాలుగేళ్లలో ఎందుకు ఒక్క సదస్సు జరపలేదు, ఒక్క పరిశ్రమ తేలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. పారిశ్రామికవేత్తలను వేధింపులకు గురిచేస్తున్నారని, అచ్చెన్న, నక్కా ఆనంద్‌బాబు అన్నారు. జే ట్యాక్స్‌కు భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌పరం చేస్తున్నారని, కడప ఉక్కుకు శంకుస్థాపనలతో కాలం గడుపుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం (YCP Goverment)పై టీడీపీ సీనియర్ నేత (TDP Leader) కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu ) మండిపడ్డారు. లోకేష్‌ (Nara Lokesh) పాదయాత్ర సునామీలా కొనసాగుతోందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. పాదయాత్రకు తమకు తామే రక్షణ కల్పించుకుంటామన్నారు. వాస్తవాలు మాట్లాడితే కొన్ని కుక్కలు మొరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీడీపీ (GDP) బాగుంటే జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తప్పుడు హామీలతో జగన్‌ (Jagan) సీఎం అయ్యారని విమర్శించారు. సీబీఐ (CBI) విచారణతో నిజమైన ముద్దాయి జైలుకెళ్లే రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. అవినాష్‌రెడ్డి (Avinash Reddy)ని సీబీఐ పిలిచినప్పటి నుంచి జగన్‌రెడ్డికి నిద్ర పట్టడం లేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2023-03-02T17:58:30+05:30 IST