Share News

Atchannaidu: ఆ ఎనిమిది జిల్లాల కలెక్టర్లు జాగ్రత్త..

ABN , First Publish Date - 2023-11-29T16:47:06+05:30 IST

Andhrapradesh: వైసీపీ ప్రభుత్వ వైఖరి దొంగే దొంగ అన్న చందగా ఉందని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ ప్రతినిధి బృందం కలిసింది. అనంతరం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ... వ్యవస్థ మీ చేతుల్లో పెట్టుకొని ఓడిపోతాం అని దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

Atchannaidu: ఆ ఎనిమిది జిల్లాల కలెక్టర్లు జాగ్రత్త..

అమరావతి: వైసీపీ ప్రభుత్వ వైఖరి దొంగే దొంగ అన్న చందంగా ఉందని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని టీడీపీ ప్రతినిధి బృందం కలిసింది. అనంతరం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ... వ్యవస్థ మీ చేతుల్లో పెట్టుకొని ఓడిపోతామని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఏపీలో 8 జిల్లాల కలెక్టర్‌లు వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని.. వారిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫార్మ్ 6, 7, 8 డుప్లికేట్‌లపై తాము పట్టిన అప్లికేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.


పరిటాల సునీత (Paritala Sunitha) 20 వేల ఓట్లు బోగస్ ఉన్నాయని చెపితే ఫామ్ 7 పెట్టమని కలెక్టర్ చెప్పారన్నారు. అదే జిల్లా ఉరవకొండలో మాత్రం 10 వేల ఓట్‌లు తీసేశారన్నారు. రెండు చోట్ల కలెక్టర్ ఒక్కరే అని చెప్పారు. 17 నియోజకవర్గాల్లో ఆధారాలతో సహా వైసీపీ ఓట్లు అక్రమాలపై ఫిర్యాదు చేశామన్నారు. 8 జిల్లాల కలెక్టర్‌లు చేస్తున్న తప్పులు అన్ని రికార్డ్ అవుతున్నాయ మీరు జాగ్రత్తగా ఉండాలన్నారు. శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, అన్నమయ్య, బాపట్ల, తిరుపతి తదితర జిల్లాల కలెక్టర్‌లపై ఫిర్యాదు చేశామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Updated Date - 2023-11-29T16:47:08+05:30 IST