TDP: పల్నాడు జిల్లాలో టెన్షన్.. టెన్షన్
ABN , First Publish Date - 2023-03-05T15:08:18+05:30 IST
జిల్లాలోని సత్తెనపల్లి మండలం పెదమక్కెనలో టెన్షన్.. టెన్షన్.. వాతావరణ పరిస్థితి నెలకొంది.
పల్నాడు: జిల్లాలోని సత్తెనపల్లి మండలం పెదమక్కెనలో టెన్షన్.. టెన్షన్.. వాతావరణ పరిస్థితి నెలకొంది. సాయంత్రం ఎన్టీఆర్, కోడెల శివప్రసాదరావు విగ్రహాల ఆవిష్కరణ, బహిరంగ సభకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నిర్ణయించిన సభావేదిక మార్చాలని పోలీసులు చెబుతున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం కన్నుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారని, ప్రభుత్వం చెప్పినట్లే పోలీసులు నడుచుకుంటున్నారని టీడీపీ నేతలు వాపోతున్నారు.
గతంలో ఏం జరిగిందంటే..?
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కోమెరపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేత స్వర్గీయ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ సందర్బంగా టీడీపీ ర్యాలీలపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. వైసీపీ వర్గీయులు రాళ్లు విసరడంతో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కారు స్వల్పంగా ధ్వంసం అయ్యింది. ర్యాలీలో పాల్గొన్న పలువురు టీడీపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.