Share News

Minister Ushasri Charan: ఉషశ్రీ చరణ్ ప్రకటనపై మండిపడుతున్న వైసీపీ శ్రేణులు.. ఇంతకీ మంత్రి ఏమన్నారంటే..?

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:20 PM

Andhrapradesh: పెనుకొండలో పోటీపై మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. పెనుకొండలో పోటీ చేయడం తన బాధ్యత అని... వైసీపీ అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి ఉంటున్నా అంటూ మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Minister Ushasri Charan: ఉషశ్రీ చరణ్ ప్రకటనపై మండిపడుతున్న వైసీపీ శ్రేణులు.. ఇంతకీ మంత్రి ఏమన్నారంటే..?

శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండలో పోటీపై మంత్రి ఉషశ్రీ చరణ్ (Minister Usha sri Charan) చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి.పెనుకొండలో పోటీ చేయడం తన బాధ్యత అని... వైసీపీ అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి ఉంటున్నా అంటూ మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఉషశ్రీ వద్దు... శంకరన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. శంకరనారాయణకు సీటు ఇస్తే గెలిపించుకుంటామని అన్నారు. ఉషశ్రీ చరణ్ ముఖం కూడా చూడలేదని... ఆమె ఫోటో వాల్ పోస్టర్‌లోనే చూశామన్నారు. రాష్ట్రానికి మంత్రిగా ఉంటూ ఒకరోజు పెనుకొండలో పర్యటించలేదని చెప్పుకొచ్చారు. ఏ కార్యకర్తతోను ఇప్పటికీ మాట్లాడింది లేదని... ఉషశ్రీ చరణ్ తమకు అవసరం లేదంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు.


ఉషశ్రీ ఏమన్నారంటే.. ‘‘ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ సీట్లల్లో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. సామాజిక న్యాయం కోసమే ఈ మార్పులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నా. కళ్యాణదుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పిస్తున్నారు. పెనుకొండలో పోటీ చేయడం నా బాధ్యత... వైసీపీ అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి ఉంటున్నా. సంతోషంగా కొత్త బాధ్యతలు తీసుకుంటున్నా’’ అంటూ మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 28 , 2023 | 01:12 PM