Share News

Paritala Sriram: నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువుగా చూస్తే తట్టుకోలేరు

ABN , First Publish Date - 2023-11-23T14:27:52+05:30 IST

పరిటాల శ్రీరామ్‌ను మిత్రుడిగానే చూడాలని.. శత్రువుగా చూస్తే తట్టుకోలేరని ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. గురువారం పరిటాల శ్రీరామ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు భారీ బైక్ ర్యాలీ తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చేరుకుంది.

Paritala Sriram: నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువుగా చూస్తే తట్టుకోలేరు

శ్రీసత్యసాయి జిల్లా: పరిటాల శ్రీరామ్‌ను మిత్రుడిగానే చూడాలని.. శత్రువుగా చూస్తే తట్టుకోలేరని ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ (TDP Leader Paritala Sriram) అన్నారు. గురువారం పరిటాల శ్రీరామ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు భారీ బైక్ ర్యాలీ తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చేరుకుంది. చెట్లు నరికే విష సంస్కృతికి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. తాను అందరికీ మంచి చేయాలనే ముందుకు వచ్చానన్నారు. ఇక్కడ చెట్లు నరికి సాంస్కృతి చూసి.. చాలా బాధ కల్గించిందన్నారు. ఈ విష సంస్కృతికి ముగింపు పలకాలన్న ఉద్దేశ్యంతో మొక్కలు పంచడం మొదలు పెట్టానని తెలిపారు. పరిటాల రవీంద్ర స్పూర్తితో ఇది మొదలు పెట్టినట్లు చెప్పారు. అప్పట్లో ప్రత్యర్థులు ఇళ్లు కూల్చివేస్తే.. పరిటాల రవి ఇళ్లు కట్టించారని.. ఆయన రక్తం మాత్రమే కాదు.. ఆశయాలు కూడా పంచుకున్నామన్నారు.


అందుకే పది చెట్లు నరికితే 100 చెట్లు పంచుతానని.. 100నరికితే 1000, వెయ్యి నరికితే 10వేలు, 10వేలు నరికితే లక్ష చెట్లు పెంచుతామని చెప్పుకొచ్చారు. ఇది ఎన్నికల కోసం, రాజకీయాల కోసం చేసిన కార్యక్రమం కాదని.. ఈ కార్యక్రమం వెనుక తన తల్లి ప్రోత్సాహం ఉందన్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎర్రన్నాయుడు తరహాలో పోరాడుతున్నారన్నారు. ఈ జిల్లాలో చెట్లు పెంచడం అంటే ముందుగా గుర్తొచ్చిది మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాత్రమే అని అన్నారు. నియోజకవర్గం ఇంచార్జ్ అయ్యాక చెట్లు నరికివేత సమస్యను ఎదుర్కొన్నానని... ఎక్కడ చూసిన చెట్లను నరికివేశారని మండిపడ్డారు. రౌడీలు గుండాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వ్యక్తి తన తండ్రి పరిటాల రవీంద్ర అని అన్నారు. ఎన్నో గ్రామాలు ఫ్యాక్షన్ తగాదాలను రూపుమాపి శాంతిని నెలకొల్పారని పరిటాల శ్రీరామ్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, ధర్మవరం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్, మాజీ మంత్రి పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-23T14:27:53+05:30 IST