Paritala Sriram: సొంత బాబాయ్‌ను చంపిన వాడు.. బాబు అరెస్ట్ చేయించడా?
ABN , First Publish Date - 2023-09-13T13:29:53+05:30 IST
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
శ్రీ సత్యసాయి జిల్లా : సీఎం జగన్ మోహన్ రెడ్డిపై (CM Jagan reddy) టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ (TDP Leader Paritala Sriram) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద బాబుతోనే నేను కార్యక్రమంలో టీడీపీ నేతలతో కలసి పరిటాల శ్రీరామ్ రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘సొంత బాబాయ్‌ను చంపిన వాడు.. చంద్రబాబును అరెస్ట్ చేయించడా? అంటూ మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్‌లో ప్రతి రూపాయికి లెక్క ఉందని... అయినా చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినా తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ప్రతి రూపాయికి లెక్క చూపిస్తామని అధికారులే చెబుతున్నారని.. అయినా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. ఈ కేసులు తమను ఏమీ చేయలేవన్నారు. తాము ప్రజల కోసమే ఈ దీక్షలు, నిరసనలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రజలు, ఉద్యోగులు, పోలీసులు కూడా ఈ పోరాటంలో కలసి రావాలని పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు.