JC Prabhakarreddy: ప్రహరీగోడ పనులు ఆపాలని ఎక్కడా అనడం లేదు.. కానీ

ABN , First Publish Date - 2023-08-21T11:55:14+05:30 IST

తాడిపత్రిలో జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో గత వారం రోజులుగా టెన్షన్ వాతావరం నెలకొన్న విషయం తెలిసిందే.

JC Prabhakarreddy: ప్రహరీగోడ పనులు ఆపాలని ఎక్కడా అనడం లేదు.. కానీ

అనంతపురం: తాడిపత్రిలో జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో గత వారం రోజులుగా టెన్షన్ వాతావరం నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (Tadipatri Muncipal Chairman JC Prabhakar Reddy) మరోసారి మీడియాతో మాట్టాడుతూ.. ప్రహరీగోడకు సంబంధించి అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా కనీస స్పందన లేదన్నారు. మున్సిపల్ ఉద్యోగుల కోసం 1983లో లే అవుట్‌లోనే 50 అడుగుల రోడ్డు ఉందని తెలిపారు. తాడిపత్రి మున్సిపల్ ప్లానింగ్‌కు సంబంధించి సర్వే చేసి గోడ నిర్మాణం చేయాలని కోరుతున్నానన్నారు. పనులు ఆపాలని ఎక్కడా అనడం లేదని చెప్పారు. తాడిపత్రి మున్సిపాలిటీకి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఉందని.. దాని మేరకు మాత్రమే నిర్మాణం చేపట్టాలని జేసీ అన్నారు.


2022లో 60 అడుగులతో రోడ్డు అప్రూవల్ అయినట్లు గుర్తుచేశారు. మాస్టర్ ప్లాన్‌ను పట్టించుకోకుండా పనిగట్టుకుని ప్రహరీగోడను నిర్మాణం చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆర్జీలు పెట్టుకున్నానని తెలిపారు. ఎమ్మెల్యే అన్నీ సగం సగం పనులు చేసి ఊరును పాడు చేస్తున్నారని మండిపడ్డారు. పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు పెట్టుకుని గోడ కడుతున్నారని మండిపడ్డారు. ప్రజావేదికను కూల్చడానికి 10 నిమిషాలు పట్టలేదని.. అదే విధంగా ప్రహరీ గోడ ఎన్ని రోజులు కడితే అన్ని నిమిషాలలో కూల్చొచొచ్చని వ్యాఖ్యలు చేశారు. ‘‘ఐఏఎస్ అండ్ ఐపీఎస్‌కు సెల్యూట్ చేస్తున్నాను.. తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. దయచేసి చేయొద్దండి’’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వినతి చేశారు.

Updated Date - 2023-08-21T11:55:14+05:30 IST