Share News

Shankar Narayana: హిందూ దేవుళ్లపై పెనుకొండ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-12-09T12:48:38+05:30 IST

Andhrapradesh: ఐక్య క్రిస్మస్ వేడుకల్లో హిందూ దేవుళ్లపై పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Shankar Narayana: హిందూ దేవుళ్లపై పెనుకొండ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

శ్రీ సత్యసాయి: ఐక్య క్రిస్మస్ వేడుకల్లో హిందూ దేవుళ్లపై పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ (Penukonda MLA Shankar Narayana) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవుడి దర్శనం చేసుకునే వాళ్లు తాము మాత్రమే బాగుండాలని కోరుకుంటారని.. ఏసు ప్రభువును కొలిచేవారు సమాజం బాగుండాలని కోరుకుంటారని అన్నారు. సంఘం బాగుండాలని కోరుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఏసుప్రభువు కృప కోసం జరిగే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే శంకర్ నారాయణ పేర్కొన్నారు. హిందూదేవుళ్ల పట్ల ఎమ్మెల్యే శంకర్ నారాయణ చేసిన వ్యాఖ్యలుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2023-12-09T12:48:40+05:30 IST