Nara Lokesh: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్లకు లోకేష్ ఫోన్

ABN , First Publish Date - 2023-03-20T11:53:30+05:30 IST

అనంతపురం జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh).. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Choudhary)కి ఫోన్ చేసి పరామర్శించారు.

Nara Lokesh: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్లకు లోకేష్ ఫోన్

అనంతపురం జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh).. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Choudhary)కి ఫోన్ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో దాడి జరిగిన తీరును లోకేష్‌కు గోరంట్ల వివరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా? అనే అనుమానం వస్తోందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే జీవో 1 రద్దు చేయాలని డిమాండ్ చేయడం కూడా జగన్ పాలనలో నేరమేనా? అని ప్రశ్నించారు. ఉన్నత విలువలతో సుధీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న గోరంట్లపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. సోమవారం అసెంబ్లీ (Assembly)లో జరిగిన ఘటనను ప్రజాస్వామ్యవాదులు అందరూ తీవ్రంగా ఖండించాలని పిలుపిచ్చారు. బుచ్చయ్య చౌదరిపై దాడి దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే బ్లాక్‌డే (Black Day)గా లోకేష్ అభివర్ణించారు.

దళితులపై వైసీపీ దమనకాండ అసెంబ్లీలోనూ కొనసాగిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి (Bala Veeranjaneyaswamy)పై దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకమన్నారు. జీవో నెం.1తో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని.. అసెంబ్లీలో లేవనెత్తడం దళిత ఎమ్మెల్యే చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఈ దాడితో తన యుద్ధం దళితులపైనే అని.. సీఎం జగన్‌రెడ్డి (CM Jagan) మరోసారి నిరూపించుకున్నారని నారా లోకేశ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-03-20T11:53:30+05:30 IST