Anantapuram: కాల్వ శ్రీనివాసులు ఆమరణ దీక్షను భగ్నం చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2023-09-24T07:16:55+05:30 IST

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద రెండు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారు. దీంతో కాల్వ శ్రీనివాసుల దీక్షను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు.

Anantapuram: కాల్వ శ్రీనివాసులు ఆమరణ దీక్షను భగ్నం చేసిన పోలీసులు

అనంతపురం: టీడీపీ అధినేత (TDP Chief), మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Ex CM Chandrababu) అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు (Kalva Srinivasulu) ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం (NTR Statue) వద్ద రెండు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారు. దీంతో కాల్వ శ్రీనివాసుల దీక్షను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున భగ్నం చేసి.. దీక్ష శిబిరం నుంచి బలవంతంగా కాల్వతోపాటు కనేకల్ తెలుగు యువత అధ్యక్షుడు బాయినేని నవీన్‌ను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాల్వ శ్రీనివాసును తరలిస్తున్న వాహనానికి కార్యకర్తలు అడ్డుపడ్డారు. కాల్వ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో పోలీసులు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ శనివారం రాయదుర్గంలో పాలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నియోజకవర్గ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. రాయదుర్గంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న దీక్షకు ద్విసభ్య కమిటీ సభ్యులు ఆనం వెంకట నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, తెలుగుయవత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి, మాజీ జడ్పీటీసీలు రామలింగారెడ్డి, విశాలాక్షి, గాంజే నాగరాజు, ఆవుల క్రిష్టయ్య, బ్యాళ్ల నాగేంద్ర, గంగాధర్‌, బండిపరుసురాం, చండ్రాయుడు, కాయల సురేష్‌, బండి పరశురాం, మాసూల చంద్రమోహన, పెద్దన్న, నరేంద్ర, నారాయణస్వామి, ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-24T07:16:55+05:30 IST