Anantapuram Dist.: జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్

ABN , First Publish Date - 2023-07-18T17:10:57+05:30 IST

అనంతపురం జిల్లా: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అండతోనే ఈ స్థాయిలో ఉన్నానని, కార్యకర్తల అండ లేకపోతే తనకు మూడు మార్గాలున్నాయన్నారు.

Anantapuram Dist.: జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్

అనంతపురం జిల్లా: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ (Tadipatri Municipal Chairman) జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) హాట్ కామెంట్స్ (Hot Comments) చేశారు. మంగళవారం ఆయన తాడిపత్రిలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ (TDP) అండతోనే ఈ స్థాయిలో ఉన్నానని, కార్యకర్తల అండ లేకపోతే తనకు మూడు మార్గాలున్నాయన్నారు. మొదటిది ఆత్మహత్య (Suicide) చేసుకోవడం, రెండవది ఊరు విడిచి పారిపోవడం, మూడోది ఎమ్మెల్యేకు కప్పం కట్టడం అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి (MLA Peddareddy) తాను ఇంటిలో లేనప్పుడు ఇంటికొచ్చారని అన్నారు. సీఐ ఆనందరావు ఆత్మహత్యపై కోర్టులో కేసు వేస్తానని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు (Supreme Court)లో కేసు వేయడంతోనే ఇసుక రీచ్‍లు రద్దయ్యాయని, కంటెంట్ ఆఫ్ కోర్టు కింద జిల్లా కలెక్టర్‍తోపాటు మరికొందరు అధికారులకు నోటీసులు అందాయన్నారు. ఇసుక అక్రమ రవాణాను కచ్చితంగా అడ్డుకుంటానని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-07-18T17:10:57+05:30 IST