Sailajanath: బాబు అరెస్ట్ బీజేపీకి తెలియకుండా జరగదు

ABN , First Publish Date - 2023-09-25T12:20:30+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ఆలోచించడం మానేసిందని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sailajanath: బాబు అరెస్ట్ బీజేపీకి తెలియకుండా జరగదు

అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ఆలోచించడం మానేసిందని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ (Sake Sailajanath) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత 15 రోజులుగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుని వేధించడం తప్ప ఇంకేమీ లేవన్నారు. కక్షపూరిత రాజకీయాలు పక్కన పెట్టి రైతులు, ప్రజల గురించి ఆలోచించాలని హితవుపలికారు. శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. పోలీస్ యంత్రాంగం యావత్తు అధికార పార్టీ సేవలో ఉందని మండిపడ్డారు. సాక్షాత్తు తిరుమల కొండపై బస్సు కూడా దొంగతనం చేశారన్నారు. రాయలసీమ ప్రాంతం గురించి ఒక్క ప్రజా ప్రతినిధి కూడా మాట్లాడటం లేదన్నారు. ‘‘మా రాజధాని మాకు కావాలి... రాయలసీమ లో రాజధాని పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. బాబు (TDP Chief Chandrababu Naidu) అరెస్ట్ బీజేపీకి తెలియకుండా జరగదని సాకె శైలజానాథ్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-25T12:20:30+05:30 IST