Somu Veerraju: ఏపీ రాజధాని అమరావతే..

ABN , First Publish Date - 2023-05-24T11:29:21+05:30 IST

అనంతపురం: నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన సందర్భంగా మోదీ పాలనను గ్రామ స్థాయిలోకి తీసుకువెళతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

Somu Veerraju: ఏపీ రాజధాని అమరావతే..

అనంతపురం: నరేంద్ర మోదీ (PM Modi) తొమ్మిదేళ్ల పాలన సందర్భంగా మోదీ పాలనను గ్రామ స్థాయిలోకి తీసుకువెళతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతేనని.. గోరంట్ల నుంచి అమరావతి వరకు ఆరు రోడ్ల నిర్మాణానికి బీజేపీ (BJP) నిధులు విడుదల చేసిందన్నారు. అమరావతే రాజధాని అని.. దీనికి బీజెపీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అమరాతిలోనే రాజధాని అని మూడు రైళ్లు వేశామని.. విజయవాడకు కనెక్ట్ అయ్యేవిధంగా కర్నూల్, కడపలో ఎయిర్ పోర్టు (Airport) వేశామన్నారు. విజయవాడలో మూడు ప్లై ఓవర్ల బ్రిడ్జీల నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. అలాగే రాజధాని నిర్మాణానికి.. విజయవాడ అభివృద్ధికి నిధులు ఇచ్చిందన్నారు.

ఉపాధి హామీ పథకం కింద ఏపీ ప్రభుత్వానికి 50 వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని, అనంతపురం నగరంలో రూ. 350 కోట్లు ప్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఇచ్చిందని సోము వీర్రాజు తెలిపారు. బీసీలను ఉపయోగించుకొని కుటుంబ పార్టీలు బాగుపడుతున్నాయని విమర్శించారు. ప్రతి కార్పొరేషన్‌కు రూ. 10 కోట్లు విడుదల చేయాలన్నారు. ఏపీలో మైనార్టీల వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్లను సవరించాలని డిమాండ్ చేశారు. సీఎం వస్తున్న సమయంలో నెల్లూరులో మొగరాల సురేష్ అనే వ్యక్తిని డీఎస్పీ బూటు కాళ్లతో తన్నడాన్ని గవర్నర్‌కు పిర్యాదు చేశామన్నారు. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తికల సంస్థ అని, దాని పని అది చేసుకుపోతోందన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు మీడియాపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని సోము వీర్రాజు పేర్కొన్నారు.

Updated Date - 2023-05-24T11:29:21+05:30 IST