Jaggareddy: జగ్గారెడ్డి స్టైలే వేరు

ABN, First Publish Date - 2022-11-23T18:40:14+05:30 IST

ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) స్టైలే వేరు. ఆయన రూటే సఫరేటు. ఆయన ఏం చేసినా.. మిగిలిన వాళ్లకు భిన్నంగా ఉంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

హైదరాబాద్: ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) స్టైలే వేరు. ఆయన రూటే సఫరేటు. ఆయన ఏం చేసినా.. మిగిలిన వాళ్లకు భిన్నంగా ఉంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇటీవల తన గుబురు గడ్డం, జులపాలు జుట్టు తీసి కనిపించిన ఆయన... ఇప్పుడు మరో ఇప్పుడు మరో కొత్త లుక్‌ (new look)లో కనిపించారు. సాధారణంగా రాజకీయ నేతలు తెల్లటి ఖద్దరు దుస్తులనే ధరిస్తారు. ఇందుకు భిన్నంగా ఆయన సూటు, బూటు వేసుకుని గుర్తుపట్టలేనంతగా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు జగ్గారెడ్డి. ఇప్పుడు జగ్గారెడ్డి కొత్త లుక్‌లో దిగిన ఫొటోలు సోషల్ మీడియా (Social media)లో వైరల్‌గా మారాయి.

Updated at - 2022-11-23T19:56:57+05:30