కూతురు తొలి పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు.. సొంతూరుకు వస్తుండగా సడన్‌గా..

ABN , First Publish Date - 2022-11-24T20:35:00+05:30 IST

ఎంతో గారాబంగా చూసుకుంటున్న కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని అనుకున్నారా తల్లిదండ్రులు. బంధువులు, స్నేహితుల సమక్షంలో..

కూతురు తొలి పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు.. సొంతూరుకు వస్తుండగా సడన్‌గా..

ఎంతో గారాబంగా చూసుకుంటున్న కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని అనుకున్నారా తల్లిదండ్రులు. బంధువులు, స్నేహితుల సమక్షంలో సొంతూరిలో వైభవంగా నిర్వహించాలనే ఉద్దేశంతో బయలుదేరారు. కానీ మధ్యలోనే వారిని మృత్యువు కబలిస్తుందని ఊహించలేకపోయారు. సంఘటన స్థలంలోనే తల్లిదండ్రులను పొగొట్టుకున్న చిన్నారి.. మృత్యువుతో పోరాడి చివరకు తాను కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. పుట్టిన రోజు నాడే నీకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోందే... అని బంధువులు బోరున విలపిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

WhatsApp Video call: వాట్సప్‌ కాల్‌ను లిఫ్ట్ చేయడమే అతడి పాలిట శాపమైంది.. రూ.63 వేలు పోయినా..

శ్రీసత్యసాయి జిల్లా (Sathya Sai District) కనగానపల్లి మండల పరిధిలోని పర్వతదేవరపల్లి వద్ద ఈ నెల 19న జరిగిన రోడ్డు ప్రమాదంతో (road accident) తీవ్రంగా గాయపడిన చిన్నారి హాసిని (1) కోలుకోలేకపోయింది. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. తెలంగాణలోని వరంగల్‌కు చెందిన గోపీనాథ్‌, రమ్యశ్రీ దంపతులు తమ గారాలపట్టి హాసిని తొలి పుట్టిన రోజు వేడుకలను (Birthday celebrations) స్వస్థలంలో నిర్వహించేందుకు బెంగళూరు నుంచి కారులో బయలుదేరారు. 19వ తేదీ తెల్లవారుజామున మార్గ మధ్యలో ప్రమాదానికి (road accident) గురయ్యారు. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన కల్వర్టను ఢీకొట్టడంతో గోపీనాథ్‌, రమ్యశ్రీ దంపతులతో పాటూ గోపీనాథ్‌ తల్లి తారకేశ్వరి మృత్యువాత పడ్డారు.

కూతురిని చంపి సూట్‌కేసులో పెట్టి పారేసిన కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు.. 10 రోజుల క్రితమే..

ఈ ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన గోపీనాథ్‌ కూతురు హాసిని, కుమారుడు సాహిత్‌కు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అదే రోజు రాత్రి బెంగళూరుకు తరలించారు. తల్లిదండ్రులతో పాటు నాన్నమ్మను కోల్పోయిన చిన్నారులు ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ కుటుంబంలో మిగిలింది ఆ పసివారు మాత్రమే. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే.. శుక్రవారం వరంగల్‌లో హాసిని పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేవి. కానీ తన పుట్టిన రోజుకు రెండు రోజుల ముందే హాసిని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. హాసిని మృతదేహాన్ని గురువారం బంధువులకు అప్పగించారు. పుట్టిన రోజు నాడే స్వస్థలంలో పాప అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోందని బంధువులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సాహిత్‌కు బెంగళూరులో వైద్యం కొనసాగుతోంది.

యువతితో వివాహితుడి ప్రేమాయణం.. విషయం తెలిసి భార్య వదిలేయడంతో.. ప్రియురాలి వద్దకు వెళ్లి..

Updated Date - 2022-11-24T20:46:08+05:30 IST

Read more