ఫామ్‌హౌస్‌ కేసులో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-12-13T21:21:12+05:30 IST

ఫామ్‌హౌస్‌ కేసులో రోహిత్‌రెడ్డిని తీసుకెళ్లి హడావుడిగా స్టేట్‌మెంట్ రికార్డ్‌ చేయించారని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు.

ఫామ్‌హౌస్‌ కేసులో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

జగిత్యాల: ఫామ్‌హౌస్‌ కేసులో రోహిత్‌రెడ్డిని తీసుకెళ్లి హడావుడిగా స్టేట్‌మెంట్ రికార్డ్‌ చేయించారని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బెంగళూరు డ్రగ్స్ కేసు రీఓపెన్ చేస్తే చాలా విషయాలు బయటపడతాయన్నారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఉన్నాడని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం గతంలో రోహిత్‌రెడ్డికి నోటీసు ఇచ్చిందన్నారు. డ్రగ్స్‌ కేసు విషయాన్ని హైదరాబాద్ అధికారులకు, సీఎంవోకు లీక్ చేశారని పేర్కొన్నారు. లీగల్‌ టీమ్‌ విచారిస్తున్న విషయం రోహిత్‌రెడ్డికి తెలియదన్నారు. రోహిత్‌రెడ్డి వాస్తవాలు చెబుతారని సీఎం కేసీఆర్ భయమన్నారు.

Updated Date - 2022-12-13T21:21:12+05:30 IST

Read more