టీఆర్‌ఎస్‌ నేత కారులో రూ.5లక్షలు స్వాధీనం

ABN , First Publish Date - 2022-11-04T06:09:24+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ వేళ పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

టీఆర్‌ఎస్‌ నేత కారులో రూ.5లక్షలు స్వాధీనం

దేవరకొండ, నవంబరు 3 : మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ వేళ పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.5 లక్షలు అధికార టీఆర్‌ఎ్‌సకు చెందిన ఓ నేత కారులో దొరికాయి. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం మల్లపురాజుపల్లిలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఓ కారులో ఉండి ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారంటూ బీజేపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు ఆ కారులో సోదా చేయగా నగదు దొరికిందని, విచారణ కొనసాగుతుందని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాకలో ఓ ఫంక్షన్‌ హాల్‌పై దాడి చేసిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సుమారు రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. ఆరెళ్ల జంగయ్య, దేవ మల్లయ్య అనే వ్యక్తుల వద్ద ఈ నగదు దొరికింది. అంతేకాక రూ.10,200 విలువైన మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకుంది.

Updated Date - 2022-11-04T06:09:40+05:30 IST