KA Paul : టీఆర్‌ఎస్ వాళ్లు కార్లలో తిరగట్లేదా?
ABN , First Publish Date - 2022-11-04T06:15:15+05:30 IST
మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌కు ఈసీ ‘ఉంగరం’ గుర్తు కేటాయించిన విషయం తెలిసిందే..!
ఉంగరం గుర్తుపై కేఏ పాల్ వ్యాఖ్య
50వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా
నల్లగొండ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌కు ఈసీ ‘ఉంగరం’ గుర్తు కేటాయించిన విషయం తెలిసిందే..! గురువారం ఆయన పది చేతివేళ్లకు పది ఉంగరాలు తొడుక్కుని పోలింగ్ బూత్‌లను సందర్శించారు. ఓటర్లకు తన పది చేతివేళ్లను చూపిస్తూ వెళ్లారు. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనని పలువురు ఆరోపించారు. దీనిపై కేఏ పాల్ తీవ్రంగా స్పందిస్తూ.. టీఆర్‌ఎ్‌స(కారు గుర్తు) నేతలను ఉదాహరణగా చెప్పారు. ‘‘టీఆర్‌ఎస్ నేతలు బయట 30 వేల కార్లలో తిరుగుతున్నారు. వాళ్లు కార్లలో కాకుండా.. సైకిల్ మీద వస్తారా?’’ అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు తాను 50 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నానంటూ కేఏ పాల్ ఓ వీడియోను విడుదల చేశారు.