Minister Prashanth Reddy: స్వలాభం కోసం అమ్ముడుపోయిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి

ABN , First Publish Date - 2022-10-24T18:53:20+05:30 IST

రాజగోపాల్ రెడ్డి స్వలాభం కోసం అమ్ముడు పోయి మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చాడని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారని ఘాటుగా విమర్శించారు.

 Minister Prashanth Reddy: స్వలాభం కోసం అమ్ముడుపోయిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి

Nalgonda: రాజగోపాల్ రెడ్డి స్వలాభం కోసం అమ్ముడు పోయి మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చాడని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారని ఘాటుగా విమర్శించారు. ‘సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికి అందుతున్నాయి. అందుకే భారీగా టీ‌ఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. పార్టీలో చేరికలపై కిషన్ రెడ్డి మాటలు హాస్యాస్పదం. రాజగోపాల్‌రెడ్డి‌ని రూ.18 వేల కోట్లకు బీజేపీ కొనింది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ సర్పంచ్‌లకు రూ. లక్షలు ఇచ్చి బీజేపీ‌లోకి తీసుకెళ్లాడు. కాని టీ‌ఆర్‌ఎస్‌లోకి కార్యకర్తలు, ప్రజలు చేరుతున్నారు. టీ‌ఆర్‌ఎస్ ప్రజల్లో ఉన్న పార్టీ. ఈ విషయాన్ని కిషన్‌రెడ్డి అది గుర్తుంచుకోవాలి. రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదు. టీ‌ఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతుంది. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది.’ అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-10-24T18:53:23+05:30 IST