Rega Kantha Rao: బేరగాళ్లు వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త

ABN , First Publish Date - 2022-12-12T09:34:54+05:30 IST

పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rega Kantha Rao: బేరగాళ్లు వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త

భద్రాద్రి కొత్తగూడెం: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు (Pinapaka MLA Rega Kantha Rao) సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పినపాక మేధావులు, విద్యార్థులు ఆలోచించండి... అభివృద్ధి కావాలా.. అరాచకం కావాలా. పినపాకలో రంగులు మార్చే నాయకులు మూడు ముక్కలాట చూద్దాం రారండి. బేరగాళ్లు వస్తున్నారు తస్మా త్ జాగ్రత్త. బేరగాళ్ళు జోలే పట్టుకుని... ప్రత్యేకం అదృష్టం పరీక్షించుకోండి అంటూ రంగులు మార్చే మాటలు. నన్ను ఎదురుకోనుటకు నానా తంటాలు.. ఏ పార్టీ అయితే లాభం, ఏ పార్టీ అయితే నష్టం.. కూడికలు తీసివేతలతో బిజీ.. చివరకు పసుపు పార్టీలో పనికిమాలిన నాయకుని పంపే ప్రయత్నం’’ అంటూ రేగా కాంతారావు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Updated Date - 2022-12-12T09:34:55+05:30 IST