Kidnap: తండ్రి కళ్లెదుటే కూతురి కిడ్నాప్

ABN , First Publish Date - 2022-12-20T09:42:50+05:30 IST

తండ్రి కళ్లెదుటే కుమార్తె కిడ్నాప్ అయిన ఘటన జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో చోటు చేసుకుంది.

Kidnap: తండ్రి కళ్లెదుటే కూతురి కిడ్నాప్

రాజన్న సిరిసిల్ల: తండ్రి కళ్లెదుటే కుమార్తె కిడ్నాప్ అయిన ఘటన జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో చోటు చేసుకుంది. తండ్రి చంద్రయ్యతో కలిసి షాలిని హనుమన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా కిడ్నాప్‌కు గురిైంది. దేవాలయం వెలుపల కారులో కాపు కాసిన నలుగురు యువకులు... యువతి బయటకు వచ్చిన వెంటనే తండ్రిని కొట్టి బలవంతంగా లాక్కెళ్లారు. యువతిని బలవంతంగా లాక్కెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురిచేశాడు. యువతి కిడ్నాప్‌కు సంబంధించి ఫోక్సో కేసులో జైలుకి వెళ్లి వచ్చిన యువకుడిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2022-12-20T13:02:23+05:30 IST